మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Ganapathi Mangalashtakam – శ్రీ గణపతిమంగళాష్టకం
గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే |
గౌరీప్రియతనూజాయ గణేశాయాస్తు మంగళమ్ || 1 ||
నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే |
నంద్యాదిగణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || 2 ||
ఇభవక్త్రాయ చేంద్రాదివందితాయ చిదాత్మనే |
ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మంగళమ్ || 3 ||
సుముఖాయ సుశుండాగ్రోక్షిప్తామృతఘటాయ చ |
సురబృందనిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళమ్ || 4 ||
చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ |
చరణావనతానర్థ తారణాయాస్తు మంగళమ్ || 5 ||
వక్రతుండాయ వటవే వంద్యాయ వరదాయ చ |
విరూపాక్షసుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్ || 6 ||
ప్రమోదామోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే |
ప్రకృష్టపాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ || 7 ||
మంగళం గణనాథాయ మంగళం హరసూనవే |
మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళమ్ || 8 ||
శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రదమాదరాత్ |
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే || 9 ||
ఇతి శ్రీ గణపతి మంగళాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.